మంత్రివర్గ విస్తరణపై సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్

411
kcr review
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యర్ధులకు చెక్ పెట్టేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల హరీష్ రావు, కేటీఆర్ కు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ తొలి విడతలో కేటీఆర్, హరీష్‌ రావులకు చోటు దక్కలేదు. దీంతో రెండవ విడతలో వీరిద్దిరికి చోటు దక్కుతుందా లేదా అన్నది చర్చ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రెండవ విడత మంత్రి వర్గ విస్తరణ జరుగనుందని ఇన్ని రోజులు ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఉన్న సమాచారం మేరకు జులైలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తుంది. శాసనసభ సమావేశాలను జూలై నెలాఖరు లేదా ఆగస్టులో నిర్వహించాలని ఆయన అనుకుంటున్నారు. దానికి ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్.. ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్ధాయి మెజారీటి రావడంతో ఆనిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది.

తాను ఢిల్లీకి వెళ్లి కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని భావించిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో ఇంతకు మందులాగానే కేటీఆర్, హరీష్‌ రావులను తన మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడట గులాబీ బాస్.

- Advertisement -