సీజేఐ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ఆహ్వానం..

97
cm kcr
- Advertisement -

హైదరాబాద్ రాజ్ భవన్‌లో బస చేస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్నీ రమణను ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మర్యాద పూర్వకంగా కలిశారు. తెలుగు రాష్ట్రాలలో తన తొలి పర్యటనలో భాగంగా జస్టిస్ రమణ యాదాద్రి, శ్రీశైలం పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించనున్నారు. ఈ నెల 14వ తేదీన సీజేఐ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎన్వీ రమణను యాదాద్రి దర్శనానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

అలాగే శనివారం పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదుల సంఘాల ప్రతినిధులు, బార్ కౌన్సిల్ సభ్యులు కూడా జస్టిస్ రమణను కలిసి అభినందించారు. దేశంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 70 శాతం అంటే 24 నుంచి 42 పెంచినందుకు వారు జస్టిస్ రమణకు వారు కృతజ్ఞతలు తెలిపారు. దీని వల్ల తెలంగాణ ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వారన్నారు.

న్యాయమూర్తుల ఎంపికలో సామాజిక న్యాయానికి, వైవిధ్యానికి పెద్దపీట వేయాలని హై కోర్టు ప్రధాన న్యాయమూర్తులకు దిశానిర్దేశం చేసినందుకు జస్టిస్ రమణకు పలు సంఘాల ప్రతినిధులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు, అభినందించారు. ఈ సాయంత్రం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి,హైకోర్టు న్యాయమూర్తులు భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జస్టిస్ రమణను సత్కరించారు.

రాజ్ భవన్‌లో బస చేస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. సిజేఐగా నియమితులైన తర్వాత జస్టీస్ ఎన్వీ రమణ మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం సిజేఐతో కాసేపు ముచ్చటించారు.

- Advertisement -