సీజేఐని కలిసిన మంత్రి ఎర్రబెల్లి..

47
Minister Errabelli

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ యన్.వి.రమణను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. సిజేఐ గా నియమితులైన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా జస్టీస్ యన్.వి.రమణను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రాజ్ భవన్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిజేఐతో కాసేపు ముచ్చటించిన మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌లో పర్యటించాలని ఆహ్వానించారు.