CMKCR:పలు అభివృద్ధి పనులు ప్రారంభం

52
- Advertisement -

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజున సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కొండల్ వద్ద నిర్మించిన మేథా గ్రూప్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రూ.1000కోట్లతో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా 2200మందికి ఉపాధి లభించనుంది. దీంతో తెలంగాణ రైల్‌ కోచ్‌ల తయారీ కానున్నాయి. చ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం సీఎ కేసీఆర్‌ కర్మాగారంలో మిషన్లను పరిశీలించారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు వాటి పనితీరును సీఎంకు వివరించారు.

Also Read: శంకరమ్మకు సముచిత పదవి!

సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2బీహెచ్‌కే కాలనీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీనిలో సుమారు 60వేల మంది ఆవాసం ఉండేలా ఒకే చోట ఏకంగా 15660 ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్‌ చేపట్టింది. దీనికోసం ప్రభుత్వం రూ.1489.29కోట్ల ఖర్చు చేసింది. అలాగే ఈ సాయంత్రం తెలంగాణ కోసం అమరులైన ఉద్యమకారుల స్మారకార్థం హైదరాబాద్‌లో అమరుల స్థూపంను సీఎం కేసీఆర్‌ ప్రారంబించనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గడిచిన పదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదికను ప్రజలకు సీఎం కేసీఆర్‌ వివరించనున్నారు.

Also Read: KCR:డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభం

- Advertisement -