తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ప్రముఖ డాటా సంస్థ CtrlS. ఈ మేరకు దావోస్ లో తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది ప్రముఖ డాటా సంస్థ CtrlS. రూ. 10 వేల కోట్ల పెట్టుబడితో ఆసియాలోనే అతిపెద్ద డాటా సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది .
అలాగే ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కై రూట్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్‌తో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎంవోయుపై సంతకాలు చేశారు.
యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలివర్ ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటుకు అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
Also Read:దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం

