శంకరమ్మకు సముచిత పదవి!

93
- Advertisement -

తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు సముచిత పదవి దక్కనుంది. ఈ మేరకు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ విషయమై విద్యుత్ శాఖ అమాత్యులు జగదీష్ రెడ్డితో సీఎం కేసీఆర్ ఫోన్ మంతనాలు జరిపారు. అమరజ్యోతి కార్యక్రమానికి ఆహ్వానించాలని జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. శంకరమ్మకు ప్రభుత్వంలో ఏదైనా ఒక సముచిత పదవినిచ్చి ఆదరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు సీఎం. ఇవాళ సాయంత్రం ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

శంకరమ్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. గవర్నర్ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది.

Also Read:ఇటలీలో ప్రభాస్.. దాని కోసమే !

శంకరమ్మకు 2014లో బీఆర్‌ఎస్ పార్టీ హుజుర్‌నగర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.తెలంగాణ ఉద్యమ సమయంలో 2009 డిసెంబర్ 4న ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి (24) తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణం చేసుకున్నారు. ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు.

Also Read:ప్చ్.. సింగర్స్ బ్యాడ్ టైమ్ నడుస్తోంది

- Advertisement -