రోడ్డెక్కిన సిటీ బస్సులు..

118

కరోనా కారణంగా మార్చి 22 వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగడం లేదు. దాదాపు 185 రోజుల తర్వాత నిన్న పాక్షికంగా సిటీ బస్సులు రోడ్డు మీదకు వచ్చాయి. నగర శివార్లలోని డిపోల నుంచి 229 బస్సులను అధికారులు తిప్పారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 3,200 బస్సులు ఉన్నాయి.

కాగా, నేటి నుంచి నగరంలోని అన్ని ప్రాంతాల్లో సిటీ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, పరిమిత సంఖ్యలోనే బస్సులను నడపాలని ప్రభుత్వం చూస్తున్నది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే సిటీ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగడంతో బస్సులు నడిపినా ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు.