ఆసియాలో రెండో అతిపెద్ద బ్రిడ్జ్‌..దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్

250
durgam cheruvu
- Advertisement -

గ్రేటర్ ప్రజలతో పాటు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మరికొద్దిగంటల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరుకానున్నారు.

రూ. 184కోట్లతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండవ అతిపెద్ద బ్రిడ్జి. కేబుల్ బ్రిడ్జితో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45ను కలుపుతూ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్‌కు పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్‌వేగా నామకరణం చేశారు. దీని పొడవు సుమారు 754.38 మీటర్లు కాగా ఆరు లైన్లు వెడల్పుతో నిర్మించారు. పాదాచారులకు, సైకిలిస్టుల కోసం బ్రిడ్జిపై ప్రత్యేక ట్రాకులు ఏర్పాటు చేశారు. 

ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ తదితర ఐటీ సంస్థల ప్రాంతాలకు అనుసంధానంగా ఉం టుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36, మాదాపూర్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ చిక్కులు తొలగి పోనున్నాయి. జూబ్లీహిల్స్‌ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలి వైపు వెళ్లే వారికి 2 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

- Advertisement -