బిర్యానీలో చికెన్ లెగ్‌ పీస్‌ లేదు :కేటీఆర్‌కు ట్వీట్

37
ktr

బిర్యానీలో లెగ్ పీస్ రాలేదని మంత్రి కేటీఆర్‌కు కంప్లైంట్ ఇచ్చారు నెటిజన్ తోటకూర రఘుపతి . కేటీఆర్ సారు.. నేను ఆన్లైన్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అయితే ఆ బిర్యానీ లో అదనపు మసాలతో పాటు లెగ్ పీస్ రాలేదు. కావాలంటే ఈ ఫోటో చూడండి. ప్రజలకు ఇలాగేనా సేవలు అందించడం అంటూ కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.

ఆ నెటిజన్ ట్యాగ్ చేసిన దానిపై స్మార్ట్‌గా స్పందించారు కేటీఆర్. ఈ బిర్యానీ విషయంలో నేనేం చేయగలను బ్రదర్. నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు అని పేర్కొనగా ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.