దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..

94
coro

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1,73,921 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 3,563 మంది ప్రాణాలు కొల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,19,431కు చేరగా ఇప్ప‌టి వ‌ర‌కు 3,18,821 మంది మ‌ర‌ణించారు. 2,51,78,011 మంది కరోనా నుండి కోలుకున్నారు.

గత 24 గంటల్లో 31,079 కొత్త‌కేసుల‌తో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా కర్ణాటకలో 22,823 కొత్త కేసులు, కేరళలో 22,318 కేసులు, మహారాష్ట్రలో 20,740, ఆంధ్రప్రదేశ్‌లో 14,429 కేసులు నమోదయ్యాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌మోదైన కేసుల సంఖ్య 17,01,13,245కు చేరగా 35,36,896 మంది మరణించారు.