నెలలో 15వ సారి…. ముంబైలో సెంచరీ

66
petrol

నెలలో 15వ సారి పెరిగాయి పెట్రల్ ధరలు. ఈ ఒక్క నెలలోనే పెట్రోల్‌పై రూ.3.61,డీజీల్‌ పై రూ.4.11 పెరగగా వినియోగదారులకు వరుసగా పెరుగుతున్న ధరలు షాకిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టగా లీటర్‌ పెట్రోల్‌ రూ.100.19,

డీజిల్ రూ.92.17కు పెరిగింది. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.93.94, లీటర్ డీజిల్‌ రూ.84.89కి చేరగా హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.97.63, లీటర్‌ డీజిల్‌ రూ.92.54కు చేరింది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.95.51.. డీజిల్‌ రూ.89.65,కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.93.97.. డీజిల్‌ రూ.87.74, భోపాల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.102.04.. డీజిల్‌ 93.37,చండీగఢ్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.90.36, డీజిల్‌ రూ.84.55గా ఉంది.