- Advertisement -
నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘటనపై ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండవ దశ విచారణ చేపట్టింది సిఐడి బృందం .విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ లో జరిగిన షార్ట్ సర్కిట్ ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో లోతుగా విచారణ చేపడుతోంది సిఐడి బృందం. ఫైర్ సేఫ్టీ సిస్టంపై పలు కోణాల్లో అధికారులను ప్రశ్నించింది సిఐడి.ప్రమాదం సంభవించినప్పుడు మంటలు ఆర్పడంలో విఫలమవ్వడం సాంకేతిక లోపమా… అధికారుల నిర్లక్ష్యమా అనే కోణాల్లో విచారణ జరుగుతోంది.శ్రీశైలం జెన్కో కార్యాలయంలో విచారణ కొనసాగిస్తోంది ఐదుగురు సభ్యుల సిఐడి బృందం.
- Advertisement -