శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభం…

112
srisailam

శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు జ‌ల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభమైంది. 1, 2 యూనిట్ల‌లో విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభించారు మంత్రి జగదీశ్‌ రెడ్డి,సీఎండీ ప్రభాకర్ రావు. ఈ సంద‌ర్భంగా మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు మాట్లాడుతూ.. మిగ‌తా నాలుగు యూనిట్ల‌లో త్వ‌ర‌లోనే విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభిస్తామ‌ని చెప్పారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల‌తో ప్లాంట్ మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేసిన అధికారుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. గ‌త వారం రోజులుగా ట్ర‌య‌ల్ ర‌న్ చేసి.. ఇవాళ విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభించామ‌ని పేర్కొన్నారు. అంతకముందు ప‌వ‌ర్ ప్లాంట్ల‌ను ప‌రిశీలించారు.

విద్యుదాఘాతంతో ఈ ఏడాది ఆగ‌స్టు 21వ తేదీన శ్రీశైలం ప‌వ‌ర్ హౌజ్‌లో మంట‌లు చెల‌రేగి విద్యుత్ ఉత్ప‌త్తి నిలిచిపోయిన విష‌యం తెలిసిందే.