భారీగా పెరిగిన బంగారం ధర!

202
gold rate

కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం దేశీయ మార్కెట్‌లో బంగారం పరుగులు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.610 పెరిగి రూ.54,270కు చేరగా 22 క్యారెట్ల బంగారం రూ.560 పెరిగి రూ.49,750కు పడిపోయింది.

బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.50 తగ్గి రూ.65,500కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1935 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.24 శాతం పెరుగుదలతో 27.09 డాలర్లకు చేరింది.