అత్యాచార వార్తలపై స్పందించిన యాంకర్ ప్రదీప్!

150
pradeep

యాంకర్ ప్రదీప్ సహా 139 మంది తనపై అత్యాచారం చేశారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై స్పందించారు యాంకర్ ప్రదీప్‌. నిజానిజాలు తెలుసుకోకుండా, అదే నిజమని నమ్ముతూ తనపై రకరకాల ఆర్టికల్స్ రాయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక వ్యక్తికి న్యాయం చేయడం కోసం ఇంకో వ్యక్తి జీవితం నాశనం చేసేస్తారా? అని ప్రదీప్ ప్రశ్నించారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ నెట్‌వర్క్‌లో కొంత మంది చేస్తోన్న టార్చర్ వల్ల నిజం తెలిసే లోపల తనకు గానీ, తన ఫ్యామిలీకి గానీ ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మానసికంగా మానభంగం చేసినట్టే అని అన్నారు. తనపై అసత్య ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Truth Behind The False Allegations | Pradeep Machiraju