అంబానీ చౌకీదారు మోడీ…

289
rahul gandhi
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల శంఖరావాన్ని పూరించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. భైంసాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ ఆదివాసీల కోసం పోరాటం చేసిన కొమురంభీం స్పూర్తిని గుర్తు చేసుకుందామన్నారు.

మోడీ చెప్పినవన్నీ అబద్దాలే అన్నారు రాహుల్. ప్రతి కుటుంబానికి 15 లక్షల డిపాజిట్ చేస్తానని అన్నారని…2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వలేదన్నారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్‌(జీఎస్టీ)పేరుతో ప్రజల నడ్డీ విరిచారని అన్నారు.

దేశానికి కాపాలాదారుడని మోడీ చెబుతారని కానీ లలిత్ మోడీ,విజయ్ మాల్యా లాంటి వారు ప్రజలను మోసం చేసి దేశం విడిచిపారిపోవడానికి సహాయం చేశారని మండిపడ్డారు. అనీల్‌ అంబానీకి ‘చౌకీదార్‌’గా మోడీ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

అంతకముందు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ జిల్లా భైంసాకి చేరుకున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. భైంసా సభ తర్వాత కామారెడ్డిలో ఏర్పాటుచేసే బహిరంగసభలో మాట్లాడనున్నారు రాహుల్.

- Advertisement -