Rahul: రాహుల్ గాంధీని సైడ్ చేస్తున్నారా?

34
- Advertisement -

ఇండియా కూటమిలో రాహుల్ గాంధీని సైడ్ చేస్తున్నారా ? ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని కాదని వేరొకరివైపు మొగ్గు చూపుతున్నారా ? అసలు ఇండియా కూటమిలో ఏం జరుగుతోంది ? ఇలాంటి ప్రశ్నలు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఇటీవల కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనిస్తే పియ సందేహాలు రాక మానవు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమిలో 28 పార్టీలు సభ్యత్వం కలిగి ఉన్నప్పటికి కాంగ్రెస్ పార్టీనే ఆదిపత్యం కొనసాగిస్తోంది. అయితే కూటమికి సంబంధించి ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై గత కొన్నాళ్లుగా సస్పెన్స్ కొనసాగుతోంది. కూటమిలో నితిశ్ కుమార్, మమతా బెనర్జీ వంటి ఆగ్రా నేతలు ఉన్నప్పటికి ప్రధాని రేస్ లో రాహుల్ గాంధీ పేరే ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. .

కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి అనేలా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే రాహుల్ గాంధీని పి‌ఎం అభ్యర్థిగా వ్యవహరించడంపై కూటమిలో కొంతమంది నేతలు అసహనంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ నేతృత్వంలో జరిగే కూటమి సమావేశాలకు అగ్రనేతలు హాజరు కావట్లేదాని వినికిడి. ఈ నేపథ్యంలో మరో నేత పేరు పి‌ఎం అభ్యర్థి రేస్ లో ప్రధానంగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి కూటమిలో మెజారిటీ సభ్యుల మద్దతు లభించకపోతే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. కూటమిలో కూడా ఖర్గే పట్ల సానుకూలత వ్యక్తమౌతుండడంతో మల్లికార్జున్ ఖర్గేనే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రాహుల్ గాంధీని కాదని ఖర్గే వైపు కాంగ్రెస్ అధినాయకత్వం మొగ్గు చూపుతుందా అంటే చెప్పడం కష్టమే. మరి ముందు రోజుల్లో ఈ అంశం కూటమిలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Also Read:పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్

- Advertisement -