రాష్ట్రాలకు కరోనా మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం..

158
rajeev gauba
- Advertisement -

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలతో కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఢిల్లీలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరైయ్యారు.ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ ఘర్, రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో సమావేశంలో రాష్ట్రాలకు పలు ఆదేశాలు, మార్గదర్శకాలు చేసింది కేంద్రం.

అన్ని రాష్ట్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు 70% నిర్వహించాలని ఆదేశం జారీ చేసింది. పరీక్ష ఫలితాల సమయాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలి. ర్యాపిడ్ యాంటీ జెన్ పరీక్షలో నెగటివ్ వచ్చినప్పటికి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష జరిపించాలని కేంద్రం తెలిపింది. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారిని నిత్యం పర్యవేక్షించాలి. పాజిటివ్ వచ్చిన వ్యక్తి యొక్క సుమారు 25-30 కాంటాక్స్ ను గుర్తించాలి. వారిని మూడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచి అవసరం అయితే టెస్టులు చేయాలని సూచిందింది.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకై కంటైన్మెంట్ జోన్లు, మినీ కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలి. అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచన చేసింది. ఆస్పత్రుల్లో ఐసోలేషన్, ఆక్సిజన్, ఐసీయూ/వెంటిలేటర్ బెడ్స్ పెంచేలా చర్యలు చేపట్టాలి. నిరంతర ఆక్సిజన్ సరఫరాకు ప్రణాళిక రూపొందించాలి. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. వ్యాక్సిన్ల నిల్వ, సరఫరాపై కేంద్ర ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 5 సూత్రాలను అవలంభించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా సూచించారు.

- Advertisement -