బూస్టర్‌ డోసులను పంపించండి:హరీశ్‌

64
- Advertisement -

కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య జరిగిన వీడియో టెలికాన్ఫరెన్స్ లో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి టిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, డిఎంఇ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాస్ రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రానికి రాష్ట్రానికి కొవాగ్జిన్ 8లక్షలు కొవిషీల్డ్‌ 80డోసులు ఉండగా కోర్బివ్యాక్స్ డోసులు సున్నా ఉన్నాయని చెప్పారు. బూస్టర్ డోసు వేగవంతం చేసేందుకు గాను కేంద్ర అవసరమైన డోసులను పంపిణీ చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ నిత్యం కరోనా సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. బూస్టర్ డోసు విషయంలో జాతీయ సగటు 23 శాతం ఉంటే తెలంగాణ సగటు 48 శాతంగా మెరుగైన స్థితిలో ఉందన్నారు. యాన్యువల్ మెయింటెనెన్స్‌ కాంట్రాక్ట్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన వెంటిలేటర్లు, పీఎస్ఎ ప్లాంట్స్ మరమ్మతులు జరగటం లేదని… వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ముందస్తు చర్యలో భాగంగా రాష్ట్రాల్లో అవసరమైన వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఇసీఆర్పీ -3 (ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్ -3) రూపొందించే విషయమై ఆలోచించాలన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్స్ లను సమీప ఆస్ప‌త్రుల‌తో అనుసంధానం చేసేలా మ్యాపింగ్ చేసే విధానాన్ని తీసుకురావాలన్నారు.

ఇవి కూడా చదవండి…

పండుగల వేళ కోవిడ్ నియమావళి…

నేటినుంచి నాజల్‌స్ప్రే వినియోగం

ప్రపంచదేశాలపై BF7 పంజా..

- Advertisement -