బుద్దవనం ప్రాజెక్టు పూర్తి…

35
buddha-vanam

న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున‌సాగ‌ర్‌లో నిర్మిస్తున్న బుద్ధ‌వ‌నం ప్రాజెక్టు పూర్తి అయింద‌ని తెలిపారు మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్. బుద్ద జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన వర్చువల్ సమావేశంలో బౌద్ద సన్యాసులతో మాట్లాడిన మంత్రి…కొవిడ్‌-19 త‌గ్గుముఖం అనంత‌రం సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తార‌ని వెల్ల‌డించారు.

ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటు అనంత‌రం సీఎం కేసీఆర్ ఆదేశానుసారం బుద్ధ‌వ‌నం ప్రాజెక్టు తిరిగి ప‌ట్టాలెక్కిందని…. నాగార్జున సాగ‌ర్ చుట్టుప‌క్క‌ల మౌళిక స‌దుపాయాల అభివృద్దిపై ప్ర‌త్యేక దృష్టి సారించాల్సిందిగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో కోటి లింగాల, నెలకొండపల్లి, దూలికట్టు, ఫ‌నిగిరి వద్ద బౌద్ధ చారిత్రక ప్రదేశాలను పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.