జరిమానా బాదుడు…లాక్‌డౌన్‌ రాబడి 3.50 కోట్లు

32

కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ బాటపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో లాక్ డౌన్ కట్టడికి విధించి జరిమానా బాధుడికి ఏకంగా 3.50 కోట్ల ఆదాయం వచ్చింది. అనవసరంగా బయటకు వచ్చిన వారి దగ్గరి నుండి బైక్ స్వాధీనం చేసుకుని పువ్వు ఇస్తున్నారు అధికారులు.

పలు చోట్ల లాక్‌డౌన్‌ ఉల్లంఘనులకు బస్కీలు, గుంజీలు తీయడం, లాఠీలతో పోలీసులు పాఠం చెబుతుంటే కొన్నిచోట్ల మర్యాదగా బైక్‌ సీజ్‌ చేయడం జరుగుతోంది. యథాప్రకారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు సడలింపు ఉంటోంది. ఆ తరువాత కూడా రద్దీ తగ్గడం లేదు.

ఇప్పటివరకు బెంగళూరు నగర పరిధిలో 31,515 వాహనాలను జప్తుచేసి రూ.3.50 కోట్లు జరిమానా వసూలు చేశారు. ఇందులో బైకులు 25,658,ఆటోలు 1,308, కార్లు తదితరాలు 1,549 ఉన్నాయి.