3న నీరా కేఫ్ ప్రారంభం..

44
- Advertisement -

రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. 13 కోట్ల వ్యయంతో హుస్సేన్‌సాగర్ తీరాన పల్లె వాతావరణాన్ని తలపించేలా నీరా కేఫ్‌ని ఏర్పాటు చేశారు. నీరా తాగుతూ హుస్సేన్‌సాగర్ అందాలు వీక్షించేలా అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తేనున్నారు.

మే3న మంత్రి కేటీఆర్ నీరా కేఫ్‌ని ప్రారంభించనుండగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రారంభోత్స‌వ ఏర్పాట్లు వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

పల్లెటూర్లంటేనే ప్రధానంగా గుర్తొచ్చేది కల్లు. ప్రకృతికి దగ్గరగా ఆహ్లదమైన పంటపొలాల మధ్య.. చెట్టునుంచి వచ్చే కల్లును అన్ని వయసుల వారు ఇష్టపడతారు. అలాంటి కల్లుతో పాటు తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే నీరా కూడా అందరికి సుపరిచితమే. నీరాలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉండటంతో వయసుతో సంబంధం లేకుండా దీన్ని సేవించేందుకు అంతా ఇష్టపడతారు.

Also Read:Anand Mahindra: బర్త్ డే స్పెషల్

నీరాలో అనేక ఔషధ గుణాలున్నాయి. కేన్సర్ సహా 18 అనారోగ్య సమస్యలకు నీరా పరిష్కారం చూపుతుందని గౌడ కులస్తులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 4 ప్రధాన కేంద్రాల నుండి నీరాను సేకరించనున్నారు. చెట్ల నుండి వేకువజామునే లభించే నీరాను రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఇక్కడ ఒకేసారి 300 నుండి 500 మంది కూర్చుని నీరాను సేవించే విధంగా ఏర్పాట్లు చేశారు. పార్శిల్ తీసుకువెళ్లే వారికోసం ప్రత్యేక కౌంటర్‌ని కూడా ఏర్పాటు చేశారు. నీరా కేఫ్‌ నుండి ట్యాంక్‌బండ్‌లోని బుద్ద విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

Also Read:IPL 2023:ఆర్సీబీతో లక్నో ఢీ.. పరుగుల వరద ఖాయమేనా?

- Advertisement -