ఫ్రంట్ లైన్ వారియర్లుగా జర్నలిస్టులు..

62
ts

రాష్ట్రంలోని జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలిపారు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాసరావు. ఐ అండ్ పీఆర్ ద్వారా జర్నలిస్టులకు ఈ నెల 28 నుండి టీకాలు వేస్తామని తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన..రాష్ట్ర వ్యాప్తంగా టీకా పంపిణీ విజయవంతంగా కొనసాగుతోందన్నారు.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200లకు పెంచుతున్నామని…ఇప్పటివరకు 56 లక్షల మందికి టీకాలు వేసినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం 6.18 లోల కోవిషీల్డ్, 2.5 లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. సూపర్ స్ప్రైడర్లుగా గుర్తించిన వారికి ఈ నెల 28 నుండి 30 వరకు వ్యాక్సినేషన్ వేస్తామన్నారు.

కోవాగ్జిన్ తీసుకున్నవారు నాలుగు వారాల నుండి ఆరు వారాల మధ్య రెండో డోసు, కోవిషీల్డ్ తీసుకున్న వారు 12 నుండి 16 వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలన్నారు.