బీఎస్ఎన్ఎల్ మరో సరికొత్త ఆఫర్‌..

206
BSNL

ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్‌, ఐడియా ఇంకా వోడఫోన్‌ల నుంచి పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. డేటావినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది.

బీఎస్‌ఎన్‌ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు అదనంగా అపరిమిత వాయిస్ కాల్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ (ఎఫ్‌టీటీహెచ్) వినియోగదారులందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. అయితే, కొన్ని ప్లాన్లలో కేవలం బీఎస్ఎన్ఎల్ పరిధిలోనే వాయిస్ కాల్స్‌కు అవకాశం ఉండగా, మరికొన్ని ప్లాన్లలో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. జూన్ 1 నుంచే ఈ ఆఫర్ అమల్లోకి వచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

BSNL

రూ.249 నుంచి రూ.645 ప్లాన్స్ మధ్య ఏ ప్లాన్‌లో ఉన్న వినియోగదారులకైనా ఈ ఆఫర్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ వివరించింది. రూ.249 ప్లాన్‌లో బీఎస్ఎన్ఎల్ పరిధిలో కాల్స్‌ చేసుకునే అవకాశం ఉండగా, రూ.645 అంత కంటే ఎక్కువ ప్లాన్‌లో ఉన్న వినియోగదారులు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అయితే, వీటిలో చాలా వరకు నైట్ కాల్స్‌కే అవకాశం ఉన్నట్టు సమాచారం.