పెళ్లిపై శృతి హాసన్‌ కామెంట్స్‌..

239
- Advertisement -

విశ్వనటుడు కమల్ తనయ శృతి హాసన్ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. గత కొద్దికాలంగా ఈ అమ్మడికి వరసగా పరాజయాలు వెంటాడుతున్నాయి. అంతేకాదు బాలీవుడ్‌లో వేసిన ట్రైల్స్ కూడా బోల్తా కొట్టాయి. ఇక ఈ విషయాలు పక్కన పెడితే.. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ మైకేల్ కర్సోల్ తో డేటింగ్ లో బిజీగా ఉంది శృతి. ఈ విషయం అమ్మ సారికకు నాన్న కమల్ హాసన్ కు తెలిపే శృతి ఇదంతా చేయటం విశేషం. ఇక పెళ్లి గురించి ప్రశ్నిస్తే .. అసలు పెళ్ళికి ఏం తొందరొచ్చిందని అడుగుతున్నారు అని రివర్స్ కొశ్చన్ వేస్తోంది.

Shruthi Haasan

ఈ అమ్మడు అంటితో ఆగక. ఇలాంటి ప్రశ్నలు హీరోలకు ఎందుకు వేయరని కౌంటర్ ఇస్తోంది .ఆడమగలో ఇద్దరు ఒకటే అయినప్పుడు తమను మాత్రమే అడగటంలో ఉద్దేశం ఏంటని నిలదీస్తోంది . అమ్మనాన్న పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కనక తొందరపడకుండా టైం చూసుకుని పెళ్లి చేసుకుంటాను అని చెబుతోంది. గబ్బర్ సింగ్ సినిమాతో ప్రేక్షకులకు గుర్తుండిపోయిన శృతి హాసన్ రవితేజతో ఓ సినిమాలో నటించనుందని సమాచారం.

ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇద్దరు కలిసి గతంలో నటించిన బలుపు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శృతి హాసన్ శభాష్ నాయుడు సినిమాలో తండ్రి కమల్ హాసన్ తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, హీరో కూడా కమల్ హాసనే. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

- Advertisement -