కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలు గజగజవణికిపోతున్నాయి. కరోనా వైరస్ కేసులకు యువతే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్ధ వెల్లడించగా కరోనా కేసుల్లో అమెరికా అగ్రస్ధానంలో ఉండగా బ్రెజిల్ రెండో స్ధానంలో ఉంది. కరోనాతో బ్రెజిల్ చిగురుటాకులా వణికిపోతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.5 మిలియన్లకు చేరగా, 90 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా బ‌్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనరో భార్య మిచ్చెల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మిచ్చెల్లి ఆరోగ్యకరంగా ఉన్నారని, కొవిడ్ నివారణ జాగ్రత్తలు పాటిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే బ్రెజిల్ అధ్యక్షుడికి కూడా కరోనా సోకగా కొన్ని వారాల పాటు ఆయన క్వారంటైన్‌లో ఉన్న అనంతరం టెస్టులు చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా వైరస్ కేసులు కోటి 70 లక్షలు దాటాయి. అనేక దేశాల్లో వైరస్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని, ఆ కేసులు పెరగడానికి యువత ప్రధాన కారణంగా నిలుస్తున్నారని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసిస్ తెలిపారు.