బ్రెజిల్‌లో ఆగని కరోనా ఉదృతి…

216
coronavirus
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో బ్రెజిల్‌లో 50,644కరోనా కేసులు నమోదు 1060 మంది మృత్యువాతపడ్డారు.

ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,275,520కు చేరగా 106,523 మంది కరోనా మహమ్మారితో మృతిచెందారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు 5.2 మిలియన్లు దాటగా ప్రపంచ స్థాయిలో కరోనావైరస్ కేసుల్లో యూఎస్‌ తరువాత బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 21 మిలియన్లకు పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడగా 7,61,000 మంది ప్రాణాలు కొల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న కరోనా వ్యాప్తిని ఒక మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -