16 లక్షల 38 వేలకు చేరిన కరోనా కేసులు..

192
covid 19

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. రోజుకు రికార్డు స్ధాయిలో 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది.

గ‌త 24 గంట‌ల్లో దేశంలో 55,079 పాజిటివ్ కేసులు నమోదుకాగా 779 మంది మృతిచెందారు. ఇక ఇప్పటివరకు 16,38,871 కేసులు దేశవ్యాప్తంగా నమోదుకాగా ప్రస్తుతం 5,45,318 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనా మహమ్మారి నుండి 10,57,806 మంది బాధితులు కోలుకోగా 35,747 మంది మ‌ర‌ణించారు. ఇప్పటివరకు కోటి 88 లక్షల 32 వేల 970 కరోనా టెస్టులు నిర్వహించామని ఐసీఎంఆర్ తెలిపింది. గత 24 గంటల్లో 6,42,588 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని దేశంలో ఒకే రోజు ఇంతమందికి కరోనా పరీక్షలు నిర్వహించడం తొలిసారని తెలిపింది.