ప్రపంచదేశాలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తుదిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు బిల్ గేట్స్.
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని…వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ముందంజలో ఉన్న భారత్ సహకారాన్ని తాము ఆశీస్తున్నామని తెలిపారు.వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి చాలా వ్యాక్సిన్ క్యాండిడేట్లు తుది ప్రయోగ దశకు చేరుకుంటాయని…..వచ్చే ఏడాది భారత్‌లో భారీ మొత్తంలో కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
భారత ఫార్మా సంస్థలు కేవలం ఇండియాకు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి సరిపడేలా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలవని గతంలో వ్యాఖ్యానించిన బిల్‌గేట్స్.. ఇప్పుడు.. వ్యాక్సిన్ సురక్షితం, సమర్థవంతంగా పని చేస్తుందని తేలిన తర్వాత భారత్‌లో వ్యాక్సిన్ సత్వరమే అందుబాటులోకి రావాలని తాను కోరుకుంటున్నానన్నారు.