నాని-రానా మల్టీ స్టారర్ చిత్రం..

153
rana

టాలీవుడ్‌లో ఇటీవల మల్టీస్టారర్ సినిమాలు పెరుగుతున్నాయి. తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ హీరోలు నేచురల్‌ స్టార్‌ నాని,బహుబలి స్టార్‌ దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి రానా తండ్రి సురేశ్ బాబు ప్లాన్ చేస్తున్నారట. ఓ ప్రముఖ దర్శకుడు ఇప్పటికే వీరికి సూటయ్యే కథపై వర్క్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారట. హీరోయిన్లు కూడా టాప్ కేటగిరీ అమ్మాయిలే ఉంటారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.