బిగ్ బాస్‌.. సూర్యకిరణ్‌ సంచలన వ్యాఖ్యలు..

434
Suryakiran

టాలీవుడ్ లో ‘సత్యం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు డైరెక్టర్ సూర్య కిరణ్. ఆ తరువాత కొన్ని సినిమాలను చేసి వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరయ్యారు. ఏడేళ్ల లాంగ్ గ్యాప్ తరువాత తిరిగి బిగ్ బాస్ షోతో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తొలి వారంలోనే ఇంటి ముఖం పట్టారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అసలు విషయాలను చెప్పుకొచ్చారు సూర్యకిరణ్.. అసలు హౌస్‌లో ఏం జరుగుతుంది?? తాను ఎందుకు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాల్సి వచ్చిందన్న విషయాలపై క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాను డబ్బు కోసం మాత్రమే బిగ్ బాస్‌ హౌస్‌లోకి రాలేదని సూర్యకిరణ్ స్పష్టం చేశాడు… ఇది తెలుగులో అతిపెద్ద గేమ్ షో. ఇందులో పాల్గొంటే ఉనికిని కాపాడుకోవచ్చని భావించాను. కనీసం ఓ నాలుగువారాలపాటు ఉంటాననుకున్నాను. కానీ తొలివారంలో వెళ్లిపోవడం బాధగా అనిపిందచింది. బిగ్ బాస్‌ హౌస్‌లో అమ్మ రాజశేఖర్ తప్ప సినిమాలతో జనాల ఆదరణ సంపాదించిన వారు ఎవరూ లేరూ. కానీ అందరూ పెద్ద సెలబ్రిటీల్లా ఫీలవుతూ ఉంటారు. నాకు ప్రతిరోజూ చాలా భారంగా గడిచేది. హౌస్‌లో కంటెస్టెంట్ల ఎవరూ సహజంగా ప్రవర్తించరు. అందరూ నటించేవాళ్లే. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు డ్రామాలు చేస్తారు. వాళ్ల ధోరణి నాకు ఎంతో అసహజంగా అనిపించేది. బహుశా అందుకే నేను ఎక్కువ కాలం ఉండ లేక పోయానేమో’

‘హౌస్ లోకి వచ్చిన వాళ్లంతా ముందస్తుగా చాలా ప్రిపేర్ అయ్యారు. వాళ్లకు ఉన్నన్ని తెలివితేటలు నాకు లేవు. ఓవర్ ఎక్స్ప్రేషన్స్ ఉంటేనే ఫుటేజీ ప్రేక్షకులకు కనిపిస్తుందని వాళ్లకు బాగా తెలుసు. అయితే నేను నాలా ఉన్నాను. అందుకే తొందరగా వచ్చానని భావిస్తున్నాను’ అంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.