ప్రధాని మోడీతో బిల్ గేట్స్

15
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్‌. న్యూ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ చర్చ కార్యక్రమంలో కృత్రిమ మేధ‌,డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, వాతావ‌ర‌ణ మార్పులు వంటి అంశాలపై చర్చించారు.

డిజిటిల్ విప్ల‌వంలో ఇండియా వేగంగా ముందుకు వెళ్తోంద‌ని ప్రధాని మోడీ తెలిపారు. ఆరోగ్యం, వ్య‌వ‌సాయం, విద్యా రంగాల్లో మెరుగైన ప్రగతి సాధించిందని.. భార‌త్‌లో జ‌రుగుతున్న డిజిట‌ల్ విప్ల‌వం గురించి ప్ర‌పంచ దేశాలు ఆసక్తికనబరుస్తున్నాయని చెప్పారు.

టెక్నాల‌జీని భార‌తీయుల చాలా వేగంగా ఆపాదించుకున్నార‌ని బిల్ గేట్స్ ప్రశంసలు గుప్పించారు. సాంకేతిక రంగంలో భార‌త్ దూసుకెళ్తోందని..భార‌త్‌లో డిజిట‌ల్ విభ‌జ‌న జ‌ర‌గ‌కుండా చూస్తాన‌ని తెలిపారు. పీఎం న‌మో యాప్‌లో ఉన్న ఫోటో బూత్ ఆప్ష‌న్ ద్వారా బిల్ గేట్స్‌తో ప్ర‌ధాని సెల్ఫీ దిగారు.

Also Read:KTR:బీఆర్ఎస్‌ను ప్రజలే కాపాడుకుంటారు

- Advertisement -