బిగ్‌బాస్‌ 5: ఆర్జే కాజల్‌పై శ్రీరామ చంద్ర ఫైర్..

24

19 మంది కంటెస్టెంట్లో ప్రారంభమైన బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ గందరగోళంగా కనిపిస్తోంది. పడుకునే చోట వస్తువులు అన్నీ చెల్లాచెదురుగా పడి ఉండగా, ఇక కిచెన్‌లో పనులు చేయడానికి నా వల్ల కాదంటే నా వల్ల కాదని బద్ధకిస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో మాట్లాడే ప్రతీ మాటకు బయటి నుంచి రియాక్షన్లు వస్తుంటాయి. లోపల ఉండే కంటెస్టెంట్లు, వారు మాట్లాడే మాటలకు సోషల్ మీడియాలో కౌంటర్లు వస్తుంటాయి.

ఎక్కడైనా సరే అబద్దాలు చెప్పినా, నిజాలను దాచినా కూడా నెట్టింట్లో నిజాలు బట్టబయలు అవుతాయి. నిన్నటి ఎపిసోడ్‌లో ఆర్జే కాజల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వంటగదిలో పని చేయడం నామోషీగా ఫీలవుతుందేమో ఏమో గానీ ఆర్జే కాజల్ బెట్టు చేయడం ఇంటి సభ్యులతో పాటు జనాలకు కూడా నచ్చలేదు. వంట చేయను, అంట్లు తోమను అంటూ బిల్డప్ ఇచ్చేసింది.

సిరి కెప్టెన్‌గా ఎంపికైంది. ఇంట్లోని వ్యవహారాలను ప్రక్షాళనచేసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఎవరు ఏ ఏ పనులు చేయాలని నిర్ణయించింది. అందులో కాజల్ మాత్రం తన అభిప్రాయాన్ని చెప్పింది. కిచెన్ డిపార్ట్మెంట్ తప్పా మరే పని అయినా చేస్తాను అని చెప్పుకొచ్చింది. తనకు వంట చేయడం రాదని బుకాయించింది. ఆ వెంటనే శ్రీరామ చంద్ర ఫైర్ అయ్యాడు. నేను చిన్నప్పటి నుంచి అంట్లు తొమలేదు.. ఏ పని రాదు.. అయినా కూడా ఇక్కడ పని చేస్తున్నాను.. అందరూ అన్ని పనులు చేస్తున్నారు అని అన్నాడు.

అయితే ఆర్జే కాజల్ వ్యవహారాన్ని నెటిజన్లు బయటపెట్టేశారు. గతంలో ఆర్జే కాజల్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో వంటలు వండుతూ కనిపించింది. నాన్ వెజ్ వండుతూ.. కనిపించింది. భర్త కోసం చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇలా ప్రస్తుతం వీడియోలు బయటకు రావడంతో కాజల్ అడ్డంగా బుక్కైనట్టు అయింది. ఆమెను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అసలే అతితో అందరినీ విసిగెత్తిస్తుంటే.. ఇప్పుడు ఈ అబద్దాలు కూడా తోడయ్యాయి.