బిగ్‌బాస్‌ 5 గ్రాండ్ ఫినాలే హైలైట్స్‌..

63

బిగ్‌బాస్‌ 5 సీజన్‌ గ్రాండ్ ఫినాలే నిన్న అంటే డిసెంబర్‌ 19 ఆదివారం సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా జరిగింది.. దాదాపు 106 రోజుల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్‌లో సిరి, మానస్‌లు ఎలిమినెట్‌ అవ్వగా.. మిగతా ముగ్గురులో ఇద్దరు స్టేజీపైకి వచ్చారు. అందులో ఒకరు సన్నీ విజేతగా నిలిచారు. బిగ్‌బాస్‌ 5 సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఫినాలేకు టాలీవుడ్, బాలీవుడ్‌ తారలు సందడి చేశారు. ఈ ఎపిసోడ్ విషయానికొస్తే.. హోస్ట్‌ నాగార్జున బ్లాక్‌ డ్రెస్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున మిర్చీ మూవీలోని బార్బీ గాల్‌ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ అలరించారు. తర్వాత ఐదో సీజన్‌ 14 మంది ఎక్స్‌ కంటెస్ట్‌లను ఆహ్వానించారు. వారు తమదైన స్టైల్‌తో డ్యాన్స్‌ చేసి అలరిస్తారని చెప్పారు. ఇక వరుసగా ఎక్స్ కంటెస్టెంట్స్‌ డాన్స్‌లు వేశారు. అందులో భాగంగా అనీ, నటరాజ్ మాస్టర్‌లు ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్‌కు ఇరగదీశారు. ఆ తర్వాత నాగార్జున ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన అందరిని పిలుస్తూ.. ఎవరు మీ ఫేవరేట్ కంటెస్టెంట్ అడుగారు.

ఇక బిగ్ బాస్ ఫినాలేలో భాగంగా సిరి ఎలిమినేట్ అయ్యారు. ఈ ఎలిమినేషన్‌ కోసం బిగ్ బాస్ హౌస్ మీద 5 డ్రోన్స్ తిరిగాయి. ఒక్కో డ్రోన్ మీద ఒక్కొక్క కంటెస్టెంట్ ఫోటోను ఏర్పాటు చేశారు బిగ్ బాస్. ఒక్క డ్రోన్ మాత్రం హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లిపోతుంది. అది సిరి డ్రోన్. దీంతో సిరి ఎలిమినేష‌న్ అయ్యిందని పేర్కోన్నారు నాగార్జున. ఫైన‌ల్ కంటెస్టెంట్ల‌లో సిరి ఎలిమినేట్ అయిన విష‌యం తెలిసిందే. ఇక టాప్ 4లో ఉన్న వారిలో మాన‌స్ ఎలిమినేట్ అయ్యారు. గెస్ట్‌గా వచ్చిన నానితో ఒక సూట్‌కేస్ పంపిస్తాడు బిగ్ బాస్. ఆ సూట్‌కేస్‌లో బిగ్ ఎమౌంట్ ఉంద‌ని.. అది కావాలంటే ఎవ‌రైనా తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోవ‌చ్చ‌ని చెబుతారు నాని. కానీ.. ఎవ్వ‌రూ సూట్‌కేస్ తీసుకోవ‌డానికి ఒప్పుకోరు. ఇక ఆ త‌ర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ మాన‌స్ ఎలిమినేట్ అయ్యారని అంటారు.

దీంతో ఇంట్లో టాప్ 3లో శ్రీరామ్, ష‌ణ్ముఖ్, స‌న్నీ ఉంటారు. గ్రాండ్ ఫినాలేలో భాగంగా నాగ చైతన్య గోల్డెన్ బాక్స్‌తో ఇంట్లోకి వచ్చారు. అయితే ఇంట్లో టాప్‌ త్రీలో ఉన్న ముగ్గురిలో ఎవరు కూడా ఆ బాక్స్ తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో ఎలిమినేషన్‌లో భాగంగా శ్రీరామ చంద్రను బిగ్ బాస్ ఎలిమినేట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారిలో సన్ని, షణ్ముఖ్, ఉండగా వీరిలో సన్నిని విజేతగా ప్రకటించారు నాగార్జున. ఇక దాదాపు 106 రోజుల ప్రయాణం తరువాత బిగ్ బాస్‌ ఫినాలే ఘట్టంతో ముగిసింది.

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌.. నిన్న ఆదివారం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా ముగిసింది.. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఈ ఐదవ సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ షోను నడిపించారు.