ఇద్దరి భామలతో నితిన్ ప్రమోషనల్ సాంగ్..

112
Maestro
- Advertisement -

హీరో నితిన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ 30వ చిత్రంగా మేర్ల‌పాక గాంధీ ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రం మాస్ట్రో. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, డిస్నీ హాట్ స్టార్ లో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ‘మాస్ట్రో .. మాస్ట్రో .. ‘అంటూ ఈ సాంగ్ సాగుతోంది.

మహతి స్వరసాగర్ బీట్ బాగుంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించగా రేవంత్ ఆలపించాడు. పూర్తి వీడియో సాంగ్‌ను ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5:04 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. త‌మ‌న్నా భాటియా ఓ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నితిన్ జోడీగా న‌భా న‌టేష్ న‌టిస్తున్నారు.

తారాగ‌ణం:
నితిన్‌, త‌మ‌న్నా భాటియా, న‌భా న‌టేష్‌, న‌రేష్‌, జిషుసేన్ గుప్తా, శ్రీ‌ముఖి, అన‌న్య‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, ర‌చ్చ ర‌వి, మంగ్లీ, శ్రీ‌నివాస్ రెడ్డి.
సాంకేతిక బృందం:
డైలాగ్స్‌-డైరెక్ష‌న్‌: మేర్ల‌పాక గాంధీ
నిర్మాత‌లు: ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి
బ్యాన‌ర్‌: శ్రేష్ఠ్ మూవీస్‌
స‌మ‌ర్ప‌ణ‌: రాజ్‌కుమార్ ఆకెళ్ల‌
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: జె. యువ‌రాజ్‌
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌. శేఖ‌ర్‌
ఆర్ట్‌: సాహి సురేష్‌
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌.

- Advertisement -