తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్‌బాస్‌ మానస్‌..

109

బిగ్ తెలుగు సీజన్ 5 ఫేమ్‌ మానస్‌ నాగులపల్లి గురువారం శ్రీ తిరుమల తిరుపతి వెంటేశ్వర స్వామినీ దర్శించుకున్నారు. బిగ్‌ బాస్‌లో తన చక్కని ఆట తీరుతో మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌గా అభిమానుల మన్ననలూ అందుకొని 4 వ స్థానంలో నిలిచిన మానస్‌ ఈ రోజు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. మానస్‌తో పాటు ఆయన తల్లదండ్రులు వెంకట రావు మరియు పద్మిని కూడా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భగా మానస్‌ మాట్లాడుతూ బిగ్ బాస్ షో తనకు ఎంతో నేర్పింది అని.. దానితో పాటు మంచి పేరు కూడా తెచ్చిందని చెప్పారు.