విశ్వ షర్ట్‌ను విప్పేసిన ప్రియాంక.. మానస్ షాక్..

72
Bigg Boss Telugu

బిగ్ బాస్ ఇంట్లో సండే వచ్చిందటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. నాగార్జున వచ్చి కంటెస్టెంట్లతో స్పెషల్‌గా ఆటలు ఆడిస్తాడు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. నాలుగో వారాంతం నాగార్జున వచ్చి ఒక్కొక్కరినీ ఆడుకున్నాడు. లోబోకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. అలా శనివారం నాడు ఫైర్ అయిన నాగార్జున మాత్రం.. ఆదివారం నాడు అందరిలోనూ ఫుల్ జోష్ నింపేశాడు. ఈ ఆదివారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్‌కు ఓ స్పెషాల్టీ ఉంది. నిన్నే పెళ్లాడతా సినిమా వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఆ మూవీలోని సాంగ్స్‌కు స్పెషల్‌ డ్యాన్స్‌ చేశారు ఇంటి సభ్యులు. ఇది చూసిన నాగ్‌.. సంతోషంతో తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు.

ఇక విశ్వ షర్ట్‌ను ప్రియాంక సింగ్ విప్పేసింది. ఇక ఆ తరువాత ఇద్దరూ కలిసి రొమాంటిక్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో రెచ్చిపోయారు. ఆ దెబ్బకు అందరూ ఫిదా అయ్యారు. నాగార్జున వేసిన పంచ్‌కు మానస్ షాక్ అయ్యాడు. డ్యాన్స్ చేస్తున్నంత సేపు నేను మానస్‌ను చూస్తున్నాను అంటూ నాగార్జున ఇరికించేశాడు. ఇక చివర్లో మానస్, ప్రియాంక మధ్య ఓ టాస్క్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఆ టాస్క్ ఆడుతున్న సమయంలోనే మానస్ ప్రమాదానికి గురయ్యాడు. కాలు జారి స్విమ్మింగ్ పూల్‌లో పడ్డాడు. అయితే అలా ప్రమాదం జరగడంతో ఇంటి సభ్యులతో పాటుగా నాగార్జున కూడా షాక్ అయ్యాడు. అయితే మానస్‌కు నిజంగానే పెద్ద గాయాలు అయ్యాయా? లేక ప్రోమో కోసం ఇదంతా చేశారా? అన్నది తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఆగాలి.