‘మా’ సభ్యులకు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక విందు..!

42
Prakash Raj

మా’ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న ప్రకాష్ రాజ్ మంచు విష్ణులు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. మంచు విష్ణు సీనియర్ నటులను కలుస్తూ మద్దతు కోరుతుండగా, ప్రకాశ్ రాజ్ కీలక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. తాజాగా, ప్రకాశ్ రాజ్ నటీనటులతో ‘మా’ ఎన్నికలపై ప్రత్యేక భేటీ నిర్వహించారు.

హైదరాబాదు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ వేదికగా ఈ విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన ‘మా’ సభ్యులకు ప్రకాశ్ రాజ్ తన మేనిఫెస్టోను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. వారి నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎవరికివారే తమ విజయంపై ధీమాతో ఉన్నారు. ‘మా’ ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.