BB6..కీర్తికి సపోర్టుగా మానస్

57
BB6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా నాలుగోవారం పూర్తిచేసుకోవడానికి సిద్ధమైంది. ఇక నాలుగోవారం కెప్టెన్‌గా కీర్తి ఎంపిక కాగా దీనిపై స్పందించారు మానస్. కీర్తి నా కోస్టార్.. ఆమె టైటిల్ విన్నర్ కావాలని కోరుకుంటున్నా. ఆమె ఫేస్ చేసిన స్ట్రగుల్స్ నాకు తెలుసు కాబట్టి.. ఆమె గురించి నాకు బాగా తెలుసు అన్నారు.

తను చాలామంది వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. తల్లిదండ్రుల్ని.. ఫ్యామిలీ మొత్తాన్ని పోగుట్టుకున్నా కూడా తనలాంటి జీవితం మరొకరికి రాకూడదని.. ఓ అనాధ పాపని పెంచుకుంది. దత్తత తీసుకున్నాను అని చెప్పడం కూడా ఆమెకు నచ్చదు. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు అన్నారు.

ఆమెకు నా వంతు సాయం చేయాలని అనుకున్నాను. గెలవడం ఓడిపోవడం అనేది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. కీర్తి లాంటి మంచి మనసు ఉన్న వాళ్లకి సపోర్ట్‌గా ఉండాలి.. అలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయికి మనం సపోర్ట్‌గా నిలవాలి. వర్కింగ్ ఉమెన్స్ చాలామందికి ఈమె ఇన్స్పిరేషన్. మా అమ్మని చూసిన తరువాత ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నాను అని తెలిపారు మానస్.

- Advertisement -