బిగ్ బాస్ 5..ఈవారం నామినేషన్స్‌లో ఎంతమందో తెలుసా?

79
bb5

బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ విజయవంతంగా 23వ ఎపిసోడ్‌ పూర్తిచేసుకుంది. ఇక నాలుగోవారం నామినేషన్‌ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగగా ఒకరి తప్పుల్ని ఒకరు ఎత్తుచూపుకుని మాటలు తూటాలు పేల్చారు.

ప్రతివారం లాగే ఒక్కో సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల ఫొటోలోని ఒక భాగాన్ని తీసి దాన్ని స్విమ్మింగ్ పూల్‌లో వేయాలని చెప్పారు బిగ్ బాస్.

తొలుత ప్రియ.. లోబో, సన్నీ, విశ్వ.. రవి, నటరాజ్ మాస్టర్, లోబో.. ప్రియ, సిరి, శ్రీరామ్.. శ్వేత, ఆనీ మాస్టర్, షణ్ముఖ్ జస్వంత్.. యాంకర్ రవి, లోబో, నటరాజ్ మాస్టర్.. ఆర్జే కాజల్, సన్నీ, సిరి.. ఆనీ మాస్టర్, లోబో, మానస్.. లోబో, నటరాజ్ మాస్టర్, శ్వేతా.. లబో, యాంకర్ రవి, హమీదా.. నటరాజ్ మాస్టర్, లోబో, నటరాజ్ మాస్టర్.. విశ్వ, యాంకర్ రవి, ప్రియాంక.. లోబో, కాజల్, యాంకర్ రవి.. కాజల్, నటరాజ్ మాస్టర్‌లను నామినేట్ చేయగా ఆనీ మాస్టర్… సిరి, రామ్, సన్నీ.. ప్రియ, కాజల్, జెస్సీ.. ప్రియాంక, యాంకర్ రవిలను నామినేట్ చేశారు.

దీంతో మొత్తంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, ఆనీ ఉన్నారు. వీరిలో ఈ వారం ఒకరు ఇంటినుండి ఎలిమినేట్ కానున్నారు.