తప్పు చేశా నన్ను క్షమించండి: రవి

42
Anchor Ravi

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా నాలుగోవారంలోకి ఎంటర్ కాగా తాజా ఎపిసోడ్‌లో భాగంగా యాంకర్ రవి తన తప్పును ఒప్పుకున్నారు. హౌస్‌లో మొదటినుండి డబుల్ గేమ్ ఆడుతూ వస్తున్న రవి..ప్రియా,లహరి ఇష్యూలో తన తప్పును ఒప్పుకున్నాడు.

లహరి గురించి ప్రియ దగ్గర తప్పుగా మాట్లాడి.. వాళ్లు నిలదీసేసరికి తన తల్లిపై ఒట్టేసి మరీ తప్పించుకోవడానికి ప్రయత్నించి బిగ్ బాస్ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో రవి బండారాన్ని బయటపెడుతూ నాగార్జున.. ఆ వీడియోలను బయటపెట్టేయడంతో షాక్‌కు గురయ్యాడు రవి.

దీంతో అందరి మందు నిలబడి సిగ్గుతో చేతులు జోడించి మరీ క్షమాపణ చెప్పాడు. ఈరోజు మీ ఎదురుగా తల ఎత్తుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. రెండు రోజులుగా చాలా బాధను అనుభవిస్తున్నా. గత శనివారం నా జీవితంలోనే వరస్ట్ డే అని చెప్పారు. మా అమ్మపై ఒట్టు పెట్టాను. అంతకంటే దారుణం మరోటి ఉండదు. ఈరోజు లహరి ఇక్కడ లేదు.. తను ఇక్కడ ఉండి ఉంటే మాట్లాడేవాడిని సారీ అమ్మా.. సారీ అక్కా అంటూ భావోద్వేగానికి గురయ్యారు రవి.