బిగ్ బాస్ 5..సభ్యుల జాతకాలు ఇవే

57
siri

బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ ముగింపు దశకు చేరుకుంది. హౌస్‌లోని ఐదుగురు సభ్యుల జాతకాలు చూడటానికి టరోట్ రీడర్ శాంతిని పరిచయం చేశారు బిగ్ బాస్. దీంతో శాంతి బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్‌తో మాట్లాడి.. ఒక్కొక్కరి గురించి జోతిష్యం చెప్పేసింది.

ఒక్కొక్కరి పేరు మీద కార్డ్స్ తీస్తూ వాళ్ల భవిష్యత్ ఎలా ఉండబోతుందో చెప్పేసింది శాంతి. నేను ఎవర్నీ ప్రేమించట్లేదని సన్నీ అంటే.. స్వప్న సుందరి వచ్చేసిందని జోస్యం చెప్పేసింది. సిరి గురించి చెప్తూ.. వెడ్డింగ్ బెల్స్ వినిపిస్తున్నాయని చెప్పింది. శ్రీరామ చంద్రకి విక్టరీ కార్డ్ వచ్చేసిందని.. కన్ఫ్యూజన్ వదిలేయమని చెప్పింది. మానస్‌కి మనీ, హెల్త్ అన్నీ సమకూరుతాయని చెప్పింది. ఇక షణ్ముఖ్ లవ్ రిలేషన్ షిప్ గురించి చెప్తుంటే.. నేను ఆల్రెడీ లవ్‌లో ఉన్నానని చెప్పాడు. దీంతో శాంతి.. ఎక్కడ హౌస్‌లోనా లోపలా అంటూ పగిలిపోయే పంచ్ వేసింది.

ఇక సిరి-షణ్ముఖ్‌ తమ రొమాన్స్‌తో రచ్చ చేశారు. సన్నీ గురించి ప్రస్తావిస్తూ హగ్ చేసుకుని రచ్చ చేశారు. వాడు అంతున్నా సరే.. నువ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నావ్.. నీకు గేమ్ ఆడటం వచ్చు.. అవతల వాడికి ఎక్కిరించడం వచ్చు.. నాగురించి ఏడ్చి వాడి గురించి ఏడ్చి.. నాకు ఏం రెస్పెక్ట్ ఇస్తున్నట్టురా అని అన్నాడు. ఎవడ్రా నీ మీదికి వస్తాడు.. రమ్మను.. మీదికి రావడం వరకే.. అంత సీన్ లేదు ఎవ్వడికీ.. ఏదో క్లోజ్ అప్ షాట్‌లు వేస్తారని ఏదో చేస్తున్నాడు.. అంటూ సన్నీకి వినపడేలా రెచ్చగొడుతూ మాట్లాడాడు.

ఇది విన్న సన్నీ.. చూశావా ఎలా రెచ్చగొడుతున్నారో అని మానస్‌తో అనగా.. ‘నీ పేరు పెట్టి అనలేదు కదా.. పట్టించుకోకు వదిలెయ్’ అని అనడంతో సన్నీ కామ్ అయిపోయాడు.