రాజస్థాన్‌పై హైదరాబాద్ గెలుపు..

43
srh

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా రెండో గెలుపును నమోదుచేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. 165 పరుగుల లక్ష్యఛేదనలో ఆది నుండే దూకుడుగా ఆడుతూ విజయతీరాలకు చేరింది. 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కొల్పోయి 167 పరుగులు చేసి గెలుపొందింది.

కేన్‌ విలియమ్సన్‌ (51 నాటౌట్‌),పెనర్‌ జేసన్‌ రాయ్‌ (42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 60) రాణించడంతో హైదరాబాద్ గెలుపొందగా రాయ్‌కి మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఇక అంతముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (57 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 82), జైశ్వాల్‌ (36) రాణించారు.