సోహైల్ అనుకున్నది సాధించాడు!

323
sohail

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగిసింది. గ్రాండ్ ఫినాలేలో భాగంగా ఒకరు 50 లక్షలు గెలిచే అవకాశం ఉండగా సోహైల్ – అఖిల్ అనుకున్న ప్రకారం (తలో 25 లక్షలు) ఇందులో భాగంగా అభిజిత్-అఖిల్ ఒప్పుకోవడంతో సోహైల్ 25 లక్షలు గెలుచుకున్నారు. గ్రాండ్ ఫినాలేలో రూ.25 లక్షలు తీసుకొని బయటికి వచ్చేసిన తొలి బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్.

తొలుత సొహైల్ తన నిర్ణయాన్ని బయట ఉన్న తండ్రి, తమ్ముడికి తెలపగా రూ.10 లక్షలు అనాథశరణాలయానికి ఇచ్చేయాలని సోహెల్ తమ్ముడు కండిషన్ పెట్టాడు. దీనికి సోహెల్ ఓకే చెప్పాడు. ఇక హౌస్ నుంచి వేదికపైకి వచ్చిన సోహెల్ తన ఫ్రెండ్ మెహబూబ్ ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఆ డబ్బు తనకు వద్దని అది కూడా అనాథలకు ఇచ్చేయాలని కోరాడు మెహబూబ్. దీంతో రూ.15 లక్షలు అనాథశరణాలయానికి ఇచ్చేయడానికి ముందుకొచ్చాడు సోహెల్.

సోహెల్ రూ.25 లక్షలు తన వద్దే పెట్టుకోవాలని, అనాథశరణాలయానికి రూ.10 లక్షలు తాను ఇస్తానని అన్నారు. దీంతో మెహబూబ్, సోహెల్ నాగార్జున కాళ్లపై పడిపోయారు.