సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేదలకు వరం- నిరంజన్‌ రెడ్డి

51
Minister Niranjan Reddy

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేదలకు వరంగా మారిందన్నారు. దీనిని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. అనారోగ్యం కారణంగా బాధపడుతూ మెరుగైన వైద్య సేవలు పొందుతున్న బాధితులకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.