బూట్‌ కట్ బాలరాజు… బ్లాక్ బస్టర్ హిట్

17
- Advertisement -

‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘బూట్‌ కట్ బాలరాజు’ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, హీరోలు సందీప్ కిషన్, మంచు మనోజ్, రోషన్ కనకాల, దర్శకులు శ్రీకాంత్ ఓదెల, సాయి రాజేష్ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకగా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సోహెల్ మాట్లాడుతూ.. పాషా గారి లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. ఆయన మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చారు. సినిమా అంటే ప్యాషన్ తో చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాని నిర్మించారు. ఈ సినిమా నిర్మాణం యాభై శాతం పూర్తయిన తర్వాత ఫైనాన్సియల్ గా కొంత ఇబ్బంది ఎదురవ్వడంతో నిర్మాత కాస్త ఒత్తిడికి లోనయ్యారు. ఆయన్ని ఒత్తిడి తీసుకోవద్దని చెప్పాను. మా నాన్న రిటైర్మెంట్ పైసలు, నేను సంపాదించినా పైసలు ఇల్లు కొనుక్కుందామని ఉంచుకున్నవి అన్ని ఈ సినిమాకు పెట్టాను. ఈ సినిమాతో నిర్మాతల కష్టాలు మరింతగా అర్ధమయ్యాయి. నిర్మాత దిల్ రాజు గారికి మా పరిస్థితి చెప్పాం. ఆయన చాలా గొప్ప మనసుతో ‘నైజాం నేను చూసుకుంటా, మీరు ఒత్తిడి తీసుకోవద్దు” అని చెప్పారు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏలూరు విజయ్ గారు సినిమా నచ్చి తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు. బ్రహ్మానందం గారు , సందీప్ కిషన్, మంచు మనోజ్, రోషన్ శ్రీకాంత్ ఓదెల, సాయి రాజేష్ గారు, సుమగారు ఇలా అందరూ ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. వారందరికీ కృతజ్ఞతలు. దర్శకుడు కోనేటి గారు రెండేళ్ళు పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. భీమ్స్ అన్న అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో పని చేసిన అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఇంత మంచి అవుట్ పుట్ రావడానికి కారణం బెక్కం వేణుగోపాల్ గారు. హీరోయిన్ మేఘలేఖ చక్కగా నటించడమే కాకుండా మా పరిస్థితి అర్ధం చేసుకొని సపోర్ట్ గా నిలిచింది. ఇంద్రజ గారు చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాకి వెళ్ళండి. బిగ్ బాస్ లో వునప్పుడు నా ఒరిజినాలిటీ చూసి ప్రేక్షకులు ప్రోత్సహించారు. బూట్ కట్ బాలరాజుని కూడా అలానే థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. చాలా ఫన్ ఎమోషన్ వుంటుంది. ఇందులో చాలా మంచి డ్యాన్స్ కూడా చేశాను. మనం జీవితంలో ఓడిన గెలిచినా ఒక తల్లికి కొడుకు మీద ప్రేమపోదు. అదే ఈ సినిమాలో అద్భుతంగా చూపించాం. ఫిబ్రవరి 2న థియేటర్స్ లో బూట్ కట్ బాలరాజు సినిమా చూడాలని తెలుగు ప్రేక్షలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను” అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘D ఫర్‌ దోపిడి’ సినిమా చేస్తున్న సమయంలో సోహెల్‌ నాకు పరిచయమయ్యాడు. తను సహజంగా నటిస్తాడు. అవకాశాలను సృష్టించుకుంటాడు. ఆలస్యమైనా ఇలాంటి వారిని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. సోహెల్‌ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. సోహెల్‌ స్టార్‌ అవుతాడనే నమ్మకం ఉంది. ప్రేక్షకులు మెప్పు పొందడమే ఒక నటుడి ఐడెంటిటీ. దాని కోసం ప్రయత్నిస్తాం. పదేళ్ళుగా ఆ సంకల్పంతో సోహెల్ పని చేస్తున్నారు. బూట్‌ కట్ బాలరాజు కంటెంట్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ తెహ్ బెస్ట్. ఈ చిత్రానికి ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో మంచు మనోజ్ ‘‘కోలీవుడ్‌, బాలీవుడ్‌లో ‘బిగ్‌బాస్‌’లాంటి షోస్‌లో పాల్గొని, టీవీ సిరీస్‌లో నటించి, సినిమాల్లో హీరోగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టాలీవుడ్‌లో కాస్త తక్కువ. అయినా సోహెల్‌ అనుకున్నది సాధించాడు. ‘బూట్‌ కట్ బాలరాజు’ కంటెంట్ చాలా బావుంది. బ్రహ్మానందం అంకుల్‌ ఇలాంటి యువ ప్రతిభను ప్రోత్సహించడం గ్రేట్‌. ఆయన్ను చూసి తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడుతుంది. ఆల్‌ ది బెస్ట్‌ సోహెల్‌. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా” అన్నారు

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ..‘బూట్‌ కట్ బాలరాజు’ లో సోహెల్ ని చూస్తుంటే తనలో పట్టుదల, తపన కనిపించింది. ఈ సినిమా ఘన విజయం సాధింస్తుందని చెప్పడానికి అదొక్కటి చాలు. కష్టపడితే తప్పకుండా ఫలితం వుంటుంది. తప్పకుండా ఈ ఏడాది తను విజయాన్ని అందుకుంటాడు. నిర్మాత పాషా మంచి అభిరుచితో సినిమాని నిర్మించారు. ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు

Also Read:చిరు చుట్టూ బీజేపీ.. ఏంటి ప్లాన్ ?

- Advertisement -