బిగ్ బాస్ 4..విజేత అభిజిత్

288
abhi

బిగ్ బాస్ 4 తెలుగు విజేతగా నిలిచారు అభిజిత్ . 105 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ ప్రేక్షకుల హృదయాలను గెలచుకున్నారు అభి. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీని గెలుచుకున్నారు . ఈ సందర్భంగా విజేతగా నిలిచిన అభిజిత్ పై ప్రశంసలు గుప్పించారు చిరు. అనంతరం అందరూ కలిసి సెల్ఫీ దిగి సందడి చేశారు.

అంతకుముందు మెగాస్టార్ చిరంజీవిని వేదిక మీదకు ఆహ్వానించిన నాగ్…చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తారు. చిరు సైతం నాగ్‌ ఫిజిక్‌ని కొనియాడారు.నాగ్ యాంకరింగ్ బాగుందని తెలిపారు. స్టార్ మా ఇంతటి ప్రెస్టెజీయస్ ప్రాజెక్టును చేపట్టడం అభినందనీయం అన్నారు. అనంతరం చిరు కోరిక మేరకు నాగ్ బిగ్ బాస్ జర్నీని చూపించి ప్రేక్షకులకు కనువిందు చేశారు.

ఇక ముందుగా అనుకున్నట్లుగా సోహైల్ ప్రైజ్ మనీలో సగం రూ. 25 లక్షలు గెలుచుకోగా విన్నర్‌గా నిలిచారు . అతిథిగా వచ్చిన చిరు… అభిజిత్- అఖిల్ పై ఫన్నీ సెటైర్లు వేశారు.ముఖ్యంగా అభిజిత్ ప్రతీ ఎపిసోడ్ గెలుచుకోవడానికి ప్రయత్నించారని కొనియాడగా అఖిల్ ని ఏడిపిస్తూ ప్రేమోనాల్ని గెలుచుకోవడానికి ప్రయత్నించాడని తెలిపారు చిరు. నాగ్ సైతం అఖిల్ ని ఆటపట్టించే ప్రయత్నం చేశారు.

తర్వాత సొహైల్ ని పలకరించిన చిరు….సింగరేణి ముందుబిడ్డ అంటూ ఆప్యాయంగా పలకరించారు. తన తర్వాతి సినిమాలో ఈ డైలాగ్ ని పెడతానని తెలిపాడు.దీంతో సోహైల్ ఆనందానికి అవధుల్లేకండా పోయాయి. ఇక సోహైల్ ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ బాగాలేక పోయినా తనకు వచ్చిన ప్రైజ్ మనీలో సగం సాయం చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడరు చిరు-నాగ్. ఇక సోహైల్ కోసం బిర్యానీ తీసుకొచ్చారు చిరు. అంతేగాదు సొహైల్ తీసే సినిమాలో తాను ఓ పాత్రలో నటిస్తానని మాట ఇచ్చారు చిరు. దీంతో సొహైల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.