సోహైల్ లుంగీ లాగేందుకు పోటాపోటీ!

24
sohail

బిగ్ బాస్ 4 తెలుగు ఎపిసోడ్‌ 41లో భాగంగా ఇంట్లోని అమ్మాయిలందరికీ పార్టీ చేసుకునే అవకాశం కల్పించారు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్‌లో భాగంగా ఒక్కో అబ్బాయిని పిలిపించుకుని తమను పొగిడించుకుంటున్న అమ్మాయిలు సొహైల్‌తో ఆటాడుకున్నారు.

తనదైన శైలీలో అమ్మాయిలను పొగిడిన సొహైల్ ఈ క్రమంలోనే దివి, హారిక, అరియానాలకు పొగరు అనడంతో సొహైల్ లుంగీ లాగేందుకు పోటీ పడ్డారు హారిక, అరియానా. సారీ చెప్పు అంటూ లుంగీ పట్టుకుని గట్టిగా లాగారు. మాస్ మహరాజ్ ఇక్కడ కథ వేరే ఉంటుంది అంటూ చివర్లో లుంగీ డాన్స్ వేసి అలరించాడు.

మీకు అన్న‌ద‌మ్ముల్లేరా అని సొహైల్ నవ్వుతూ ప్ర‌శ్నించ‌డంతో హారిక‌ లుంగీ లాగ‌డం వ‌దిలేసింది. అయితే తర్వాత సొహైల్‌తో అమ్మాయిలా క్యాట్ వాక్ చేయించగా అదరగొట్టాడు.