హారికతో డేటింగ్‌కి వెళ్తా: అభిజిత్

26
akhil

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 41 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో భాగంగా ఇంట్లో ఉన్న అమ్మాయిలందరికీ పార్టీ చేసుకునే అవకాశం కల్పించడంతో పొట్టిపొట్టి బట్టలతో రచ్చ చేశారు.

తర్వాత ఒక్కో అబ్బాయిని పిలిపించి పొగిడించుకునే పనిలో పడగా తొలుత వచ్చిన అభిజిత్…తనలోని రొమాంటిక్ యాంగిల్‌ మొత్తాన్ని బయటకు తీసి ఉన్న కళని మొత్తం ప్రదర్శించాడు. ఎలాంటి అమ్మాయి న‌చ్చుతుందన్న ప్ర‌శ్న‌కు అమ్మాయి లెవ‌ల్ హెడెడ్‌గా, నిజాయితీగా ఉండాలి, కరెక్ట్ నిర్ణ‌యాలు తీసుకోగల‌గాలని చెప్పుకొచ్చాడు.

నువ్ డేట్‌కి వెళ్లాల్సి వస్తే మా ఐదుగురిలో ఎవర్ని ఎంచుకుంటావ్ అని అరియానా అడుగగా నీతోనే అంటూ తెలిపి అక్కడినుండి ఎస్కేప్ అయ్యాడు.