ఎంతందంగా ఉంటావో:అఖిల్‌తో అరియానా లవ్ ట్రాక్

30
akil

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 41 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో భాగంగా ఇంట్లో ఉన్న అమ్మాయిలందరికీ పార్టీ చేసుకునే అవకాశం కల్పించడంతో పొట్టిపొట్టి బట్టలతో రచ్చ చేశారు.

ఇక టాస్క్‌లో భాగంగా చివరగా అఖిల్ రావ‌డంతోనే సంబరపడిపోయింది మోనాల్. కొత్త‌గా పెళ్లైన అమ్మాయిగా న‌టించ‌మ‌ని అఖిల్‌కు అరియానా టాస్క్ ఇచ్చింది. అఖిల్ అమ్మాయిలా ముగ్గు వేస్తుంటే ప‌క్కింటి అబ్బాయిగా హారిక లైనేసింది.

ఇక భర్తగా నటించిన అరియానా అతడిని ఆటాడేసుకుంది. ఆఫీసుకు వెళ్తున్నా సాయంత్రం మ‌ల్లెపూలు తేనా అని అడుగుతూనే అమ్మ ప‌డుకున్నాక సినిమాకు వెళ్దాం.. నీ అందం అంద‌రూ చూస్తే నేను త‌ట్టుకోలేను అంటూ అఖిల్‌తో చెప్పుకొచ్చింది అరియానా. చివరగా ఇలా చేస్తూంటే మోనాల్‌కి కోపం వస్తుందేమో అంటూ నవ్వించే ప్రయత్నం చేసింది అరియానా.